ఇంగ్లాండ్ కెప్టెన్ నన్ను అవమానించాడు.. బస్ డ్రైవర్ అని పిలిచాడు: మహ్మద్ కైఫ్

ఇంగ్లాండ్ కెప్టెన్ నన్ను అవమానించాడు.. బస్ డ్రైవర్ అని పిలిచాడు: మహ్మద్ కైఫ్

ఓవైపు లక్నో వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంటే, మరోవైపు భారత మాజీ దిగ్గజం మహ్మద్ కైఫ్ ఓ పాత జ్ఞాపకాన్ని బయటపెట్టాడు. 2023 ప్రపంచ కప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న కైఫ్.. 2002 ఇంగ్లాండ్ పర్యటన సంధర్బంగా అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ తనను అవమానించినట్లు వెల్లడించాడు. బస్ డ్రైవర్ అని హేళన చేసినట్లు తెలిపాడు. 

ఆ విజయం ఒక చరిత్ర

ఇండియా, శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాట్ వెస్ట్ సిరీస్ ‍లో ఇండియా- ఇంగ్లాండ్ ఫైనల్‌లో తలపడ్డాయి. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట 326 పరుగులు చేయగా.. ఛేదనలో భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి మరో 3 బంతులు మిగిలివుండగానే మ్యాచ్‌ను ముగించింది. 146 పరుగులకే 5 వికెట్లు కోల్పయి కష్టాల్లో ఉన్న భారత జట్టును యువరాజ్ సింగ్(69), మహ్మద్ కైఫ్(87) జోడి విజయ తీరాలకు చేరుస్తారు.

ALSO READ :- మహేశ్వరం కాంగ్రెస్ టికెట్పై పునరాలోచన చేయాలి : దేప భాస్కర్ రెడ్డి

ఆ మ్యాచ్‌లో కైఫ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సమయంలో నాజిర్ హుస్సేన్  అతని వద్దకు వచ్చి స్లెడ్జింగ్ చేయడానికి ప్రయత్నించాడట. ఆ సమయంలో బస్ డ్రైవర్ అంటూ నోటికొచ్చింది మాట్లాడాడట. ఈ విషయాన్ని కైఫ్ లక్నో మ్యాచ్  సంధర్బంగా వెల్లడించాడు. కాగా, రెండేళ్ల కిందట నాజిర్ హుస్సేన్ ఈ  విషయాన్ని అంగీకరించాడు. కైఫ్ ను బస్ డ్రైవర్ అని పిలిచినమాట వాస్తవమే అని, అయితే అది తప్పు పదం కాదని తనను తాను సమర్ధించుకున్నాడు.