బాగ్దాదీ ఆపరేషన్‌‌‌‌  వీడియో రిలీజ్‌‌‌‌

బాగ్దాదీ ఆపరేషన్‌‌‌‌  వీడియో రిలీజ్‌‌‌‌

టెర్రరిస్ట్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ ఇస్లామిక్‌‌‌‌ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ అబు బకర్‌‌‌‌ అల్‌‌‌‌ బాగ్దాదీని  మట్టుపెట్టిన ఆపరేషన్‌‌‌‌కు సంబంధించిన వీడియో, ఫొటోలను అమెరిన్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ బుధవారం రిలీజ్‌‌‌‌ చేసింది.  దాడికి ముందు, తర్వాత బాగ్దాదీ ఇంటి ఫోటోలను విడుదల చేసింది.   విజయవంతంగా ఆపరేషన్‌‌‌‌ పూర్తిచేసిన సైన్యాన్ని  అమెరికా సెంట్రల్‌‌‌‌ కమాండ్‌‌‌‌ చీఫ్‌‌‌‌ జనరల్‌‌‌‌ మెకెంజీ మెచ్చుకున్నారు. అమెరికన్‌‌‌‌ సైన్యం దాడిని ఎదుర్కొనలేక  సిరియాలోని ఇద్లిబ్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో బాగ్దాదీ  ఆదివారం  ఆత్మహత్య చేసుకున్నాడు.