
న్యూఢిల్లీ: బజాజ్ ఆటోకి ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ. 1,719 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కానీ, కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.2,040 కోట్లతో పోలిస్తే ఈసారి కంపెనీ ప్రాఫిట్ 16% తగ్గింది. క్యూ2 లో ఎగుమతులు 25% (ఏడాది ప్రాతిపదికన) పడిపోవడంతో ప్రాఫిట్ తగ్గిందని కంపెనీ పేర్కొంది. రెవెన్యూ (కార్యకలాపాల నుంచి) రూ. 8,762 కోట్ల నుంచి రూ.10,203 కోట్లకు పెరిగింది.