
- యూనిట్‌ను క్లోజ్ చేయాలని యూనియన్ల డిమాండ్
ముంబై: కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కంపెనీలు, ప్రొడక్షన్ యూనిట్లు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వర్కర్లు కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్రన్ మహారాష్ట్ర బజాజ్ యూనిట్‌లో 250 మంది ఎంప్లాయిస్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యూనిట్‌ని క్లోజ్ చేయాలని బజాజ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా అసలే ప్రొడక్షన్ లేదని, ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా కంటిన్యూ చేసే పొజిషన్ కనిపించడం లేదని వర్కర్లు అన్నారు. వర్కర్స్ పనికి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారని, కొంత మంది లీవ్ తీసుకుంటున్నారని అన్నారు. జూన్ 26 నాటికి స్టాఫ్‌లో దాదాపు 8వేల మంది స్టాఫ్‌లో 140 మంది వ్యాధి బారిన పడ్డారని, వారిలో ఇద్దరు చనిపోయారని యూనియన్ మెంబర్లు అన్నారు. కానీ యాజమాన్యం మాత్రం పనికి రావాల్సిందే అని లెటర్లు పంపిందని, జీతం ఇవ్వం అని చెప్తున్నారని బజాజ్ యూనియన్ బాజీరావ్ అన్నారు.