
న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్, త్రీ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బజాజ్ యూరప్ లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ను రిజిస్టర్ చేయించింది. యూరోపియన్ యూనియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీసులో పేటెంట్ నమోదు ప్రక్రియ పూర్తయింది. ఫిబ్రవరిలో ఈ రిజిస్ట్రేషన్ కు అప్లయ్ చేసుకుంది. పూణే బేస్డ్ గా నడుస్తున్న ఈ ఆటోమేకర్ కంపెనీ వ్యాలిడేషన్ పీరియడ్ 2029వ సంవత్సరం నవంబర్ వరకు ఈ అందుబాటులో ఉండుంది. ఈ ఏడాది జనవరిలోనే ఈ స్కూటర్ ను ఇండియా మార్కెట్ లో లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కేవలం 15 రోజుల్లోనే దాదాపు 2 వేల బుకింగ్స్ రావడం విశేషం.
ఇండియా వెలుపలు ఏ దేశంలోనూ ప్రత్యర్థి బ్రాండ్లు చేతక్ మోడల్ ను కాపీ కొట్టకుండా బజాజ్ తాజాగా యూరప్ లో పేటెంట్ తీసుకుంది. చేతక్ ఈ–స్కూటర్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ లో ఉండే అర్బేన్ తోపాటు టాప్ ఎండ్ ప్రీమియం వేరియంట్ కూడా ఉంది. దీని స్పీడ్ 3.8 కిలో వాట్స్ పర్ 4.1 కిలో వాట్స్ గా అంచనా వేస్తున్నారు. దీంట్లో లిథియం ఇయాన్ బ్యాటరీని యూజ్ చేశారు. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 95 కి.మీ.ల వరకు వెళ్తుతుంది. అదే స్పోర్ట్ మోడ్ లో 85 కి.మీ. ల వరకు వెళ్తుంది. పూణె, బెంగళూరులోని చేతక్ ఎలక్ట్రిక్స్ సర్వీస్ సెంటర్స్ లో బజాజ్ తన కార్యకలాపాలను తిరిగి మొదలు పెట్టింది. త్వరలోనే చేతక్ ఈ–స్కూటర్ సేల్స్ ప్రారంభమవుతాయని బజాజ్ పేర్కొంది.