
న్యూఢిల్లీ : బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రమోటర్ సంస్థలు తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు సుమారు రూ. 4,750 కోట్ల విలువైన బ్లాక్ డీల్‌ను ప్రారంభించాయి. ఈ డీల్‌లో అదనపు విక్రయ అవకాశం కూడా ఉంది. బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, జమ్నాలాల్ సన్స్ బజాజ్ ఫిన్‌సర్వ్‌లో సుమారు 1.94శాతం వాటాను అమ్ముతాయి. మొత్తం డీల్ విలువ రూ. 5,828 కోట్లు కాగా, బేస్ డీల్ విలువ రూ. 4,750 కోట్లు. అప్‌సైజ్ ఆప్షన్ రూ. 1,078 కోట్లు ఉంటుంది.
ఫ్లోర్ ధర ఒక్కో షేరుకు రూ. 1,880 కాగా, ఇది ప్రస్తుత మార్కెట్ ధర కంటే సుమారు 3.3శాతం తక్కువ. ఈ బ్లాక్ డీల్ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా ప్రమోటర్లు తమ నిధులను ఇతర పెట్టుబడుల కోసం లేదా కంపెనీ పునర్నిర్మాణ కోసం ఉపయోగించుకోవచ్చని అంచనా.