
ఢిల్లీలో బాల సాహిత్య పురస్కార్ అవార్డులను ప్రధానం చేశారు. వివిధ భాషల్లోని రచయితలకు బాల పురస్కార్ అవార్డులు అందజేశారు. అలాగే.. 20 భాషలకు చెందిన రచయితలకు.. కేంద్ర సాహిత్య అకాడమీ, మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో అవార్డులను అందించారు. తెలుగు నుంచి బాల సాహిత్య పురస్కార్ అవార్డును పత్తిపాక మోహన్ అందుకున్నారు. బాలల తాత గాంధీజీ అనే పుస్తకం రాసినందుకు ఆయనకు అవార్డు లభించింది.
ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని పత్తిపాక మోహన్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బాలసాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ పురస్కారాన్ని 2010 నుండి అమలు చేస్తున్నారు. ప్రతి ఏడాది గుర్తించిన భాషల్లో వచ్చిన అత్యున్నత స్థాయి బాల సాహిత్యానికి ఈ పురస్కారం లభిస్తుంది.