Ellamma Movie: ఎల్లమ్మ స్క్రిప్ట్తో దర్శకుడు బలగం వేణు.. రెండో మూవీపై కీలక అప్డేట్

Ellamma Movie: ఎల్లమ్మ స్క్రిప్ట్తో దర్శకుడు బలగం వేణు.. రెండో మూవీపై కీలక అప్డేట్

'వేణు యెల్డండి'.. ఈ పేరులో ఓ అరుదైన మట్టివాసన ఉందని తన మొదటి సినిమాతోనే తెలియజేశాడు. బలగం (Balagam)సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకుని తన సత్తా చాటాడు.

ఈ క్రమంలోనే తన రెండోమూవీ కూడా స్వచ్ఛమైన పల్లెటూరు కథాంశంతో తెరకెక్కుతోందని వెల్లడించి అంచనాలు పెంచాడు. నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. నితిన్ హీరోగా వేణు రూపొందించనున్న రెండో మూవీ ‘ఎల్లమ్మ’. 

ALSO READ | HariHaraVeeraMallu: ‘హరిహర వీరమల్లు’ థర్డ్ సింగిల్ స్పెషల్.. కీరవాణి ప్రతిభను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

లేటెస్ట్గా ‘ఎల్లమ్మ’ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు దర్శకుడు వేణు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎల్లమ్మ’అంటూ స్క్రిప్ట్ బుక్ పట్టుకుని ఫోటో షేర్ చేశాడు. వేణు తన X ఖాతాలో షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన రెండో సినిమా కూడా భారీ విజయం సాధించాలని నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.

వేణు తన మొదటి విజయంతో పొంగిపోకుండా.. కాస్తా గ్యాప్ తీసుకుని పక్కా ప్లానింగ్ తో వస్తుండటం పట్ల ప్రతిఒక్కరూ హక్కును చేర్చుకుంటున్నారు. ఈ మూవీ జూన్ లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. సరిగ్గా ఐదు నెలల్లోపే షూటింగ్ కంప్లీట్ చేసి, డిసెంబర్ నెలలో రిలీజ్కు తీసుకొచ్చేలా వేణు పక్కా ప్రణాళికతో వస్తున్నాడు. 

ఇప్పటికే రంగస్థల కళాకారులను కూడా ఎంపిక చేసి వారితో ప్రత్యేక రిహార్సల్స్ కూడా చేయిస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. 

ఈ సినిమాకు గ్రామదేవత పేరైన ‘ఎల్లమ్మ’అని టైటిల్ ఫిక్స్ చేసుకోవడంతోనే వేణు సక్సెస్ అయ్యాడు. ఇక అందుకు తగ్గట్టుగానే సినిమాలో ఆధ్యాత్మికం, తెలుగు నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాడంటే వేణు మిగతా భాగం గెలిచినట్లే. ఎందుకంటే తెలంగాణలో మహిళలకు ఇలాంటి పేరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ చేరువయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి.

అయితే, ఈ కథకి ముందుగా హీరో నాని నటిస్తున్నట్లు ముందునుంచి టాక్ వినిపించింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నితిన్ దగ్గరకి వెళ్ళింది. అలాగే హీరోయిన్ గా సహజనటి సాయి పల్లవి నటింస్తుందని కూడా వినిపించింది. ఆమెకు బదులుగా కీర్తి సురేష్ నటించనుంది.