Akhanda 2 Bookings: అఖండ 2 తెలంగాణ బుకింగ్స్ ఓపెన్: డిసెంబర్ 4న రాత్రి 8 గంటల షో.. టికెట్ రేటు ఎంతంటే..

Akhanda 2 Bookings: అఖండ 2 తెలంగాణ బుకింగ్స్ ఓపెన్:  డిసెంబర్ 4న రాత్రి 8 గంటల షో.. టికెట్ రేటు ఎంతంటే..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన చిత్రం ‘అఖండ2 : తాండవం’. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట  నిర్మించారు. డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా  తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ జీవో జారీ చేసింది. 

‘అఖండ2’ టీం ప్రత్యేక అభ్యర్థన మేరకు.. విడుదలకు ముందు రోజు అంటే.. ఇవాళ (డిసెంబర్ 4) నుంచే స్పెషల్ షోకి పర్మిషన్ వచ్చింది. ఈ క్రమంలో అఖండ 2 ప్రీమియర్ షో రాత్రి 8 గంటలకు పడనుంది. దీన్ని టికెట్ ధర రూ.600లుగా(+GST) నిర్ణయిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అలాగే, మూవీ విడుదలైన రోజు నుండి అంటే.. డిసెంబర్ 5 నుంచి 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఓ స్పెషల్ కండిషన్ పెట్టింది. పెంచిన టికెట్ రేట్ల నుండి 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం సినీ కార్మికలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.