
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తవగా, రీసెంట్‌గా మరో షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. ఎలక్షన్స్ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ.. ఇటీవల తిరిగి సెట్‌లో జాయిన్ అయ్యారు. సూపర్ స్పీడ్‌తో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ నెలాఖరులో మరో షెడ్యూల్‌ను మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇది పదిహేను రోజుల పాటు జరగనుందని సమాచారం. బాలయ్యతో పాటు కీలక పాత్రధారులంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ కంప్లీట్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న 109వ సినిమా ఇది.
ఊర్వశి రౌటెలా కీలకపాత్ర పోషిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలోనే మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నారు.