అది మా హీరోలందకీ గర్వకారణం.. నేషనల్ అవార్డ్స్పై స్పందించిన బాలకృష్ణ

అది మా హీరోలందకీ గర్వకారణం.. నేషనల్ అవార్డ్స్పై స్పందించిన బాలకృష్ణ

70 ఏళ్ళ తెలుగు చలన చిత్ర చరిత్రలో మొదటి సారిగా సోదరుడు అల్లు అర్జున్‌(Allu Arjun)కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం నటునిగా ఎంతో గర్వపడుతున్నాను. అల్లు అర్జున్ కు నా శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). 

హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ..తెలుగు సినిమా సత్తాను దేశ విదేశాలలో చాటాము, విదేశీయులు కూడా మన తెలుగు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ స్థాయికి మన చలన చిత్ర పరిశ్రమ చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. పుష్ప సినిమాతో పాటూ ఆర్ఆర్ఆర్, ఉప్పెన సినిమాలకు కూడా నేషనల్ అవార్ఢులు దక్కడం తెలుగు వారికి గర్వకారణం. ఈ సూర్తితోనే తెలుగు సినిమా పని చేయాలని సూచించారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.