గొడ్డలికి కళ్ళజోడు.. మధ్యలో నరసింహ ఉగ్రరూపం.. బాలయ్య కొత్త సినిమా అప్డేట్

గొడ్డలికి కళ్ళజోడు.. మధ్యలో నరసింహ ఉగ్రరూపం.. బాలయ్య కొత్త సినిమా అప్డేట్

నరసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో ఎన్నడూ లేనంత హుషారుతో దూసుకుపోతున్నారు. ఇటీవలే భగవంత్‌ కేసరి(Bhagavanth kesari)తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. ఇప్పడు మరో సినిమాను మొదలెట్టేశారు. వాల్తేరు వీరయ్యతో భారీ హిట్ అందుకున్న దర్శకుడు బాబీ(Bobby)తో బాలయ్య తన 109వ సినిమా చేస్తున్నారు.

ఇటీవలే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి(నవంబర్ 8) నుండి మొదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి షూటింగ్ అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ  పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ పవర్ ఫుల్ గా ఉంది. పదునైన గొడ్డలికి ఆంజనేయ స్వామి తాయెత్తు, కళ్లజోడు, ఆ కళ్లజోడులో నరసింహ స్వామి ఉగ్రరూపం కనిపించేలా సెట్ చేశారు. ఈ పోస్టర్ పై.. బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్.. వైలెన్స్ కా విజిటింగ్ కార్డ్..  అనే పవర్ ఫుల్ లైన్స్ జతచేశారు.   

ఇవన్నీ చూస్తుంటే.. ఈ సినిమాలో బాలయ్య స్టైలీష్ గా కనిపిస్తూనే.. మాస్ జాతర చేయనున్నాడని అర్థమవుతోంది. దీంతో ఈ పోస్టర్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ సినిమాతో మల్లయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.