బాలకృష్ణ మూవీ.. నెక్స్ట్​​ షెడ్యూల్​రాజస్థాన్‌‌లో

బాలకృష్ణ మూవీ.. నెక్స్ట్​​ షెడ్యూల్​రాజస్థాన్‌‌లో

దసరాకి ‘భగవంత్ కేసరి’గా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్‌‌ను అందుకున్న బాలకృష్ణ..  నెక్స్ట్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు.  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌లో స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్‌‌ను పూర్తి చేశారు. తర్వాతి షెడ్యూల్‌‌ను రాజస్థాన్‌‌లో మొదలుపెట్టనున్నారు. దీనికోసం రాజస్థాన్‌‌లో లొకేషన్స్ వెతికే పనిలో ఉంది మూవీ టీమ్.  ‘బ్లడ్ బాత్‌‌ కా బ్రాండ్ నేమ్.. వైలెన్స్‌‌  కా విజిటింగ్ కార్డ్‌‌’

అంటూ బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఇటీవల రిలీజ్ చేసిన కాన్సెప్ట్  పోస్టర్‌‌‌‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఇది బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమా. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌, ఫార్చ్యూన్‌‌ ఫోర్ సినిమాస్‌‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.