ఆయుధపూజకు సిద్దమైన భగవంత్ కేసరి.. థియేటర్స్లో పూనకాలే

ఆయుధపూజకు సిద్దమైన భగవంత్ కేసరి.. థియేటర్స్లో పూనకాలే

నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth kesari). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. దీంతో భగవంత్ కేసరి సినిమా కోసం బాలయ్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

బాలయ్య అభిమానుల ఎదురుచూపులకు పులిష్టాప్ పెడుతూ.. భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తూ మరో కొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ పోస్టర్ లో బాలకృష్ణ రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకొని చాల పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. 

ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్(Kajal agarwal) నటిస్తోంది. ఇక మరో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించనుంది. మరి దసరాకు రిలీజ్ కు సిద్దమైన ఈ భగవంత్ కేసరి.. ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.