రఫ్ అండ్ రగ్డ్ లుక్‌‌‌‌‌‌‌‌లో బాలకృష్ణ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్ రోల్

రఫ్ అండ్ రగ్డ్ లుక్‌‌‌‌‌‌‌‌లో బాలకృష్ణ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్ రోల్

పాత్రకు తగ్గట్టు ఎలాంటి గెటప్‌‌‌‌‌‌‌‌లోనైనా నటించేందుకు వెనకాడరు బాలకృష్ణ. ఇప్పటికే పలు చిత్రాలతో దాన్ని  ఫ్రూవ్ చేశారు.  తాజాగా మరోసారి డిఫరెంట్ రోల్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి కొన్ని క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ఇందులో బాలయ్య మరోసారి డ్యూయెల్ రోల్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నారని, అయితే సెకెండ్ హాఫ్‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌లో ఆయన ఓల్డ్ గెటప్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కనిపించేది తక్కువ సమయమే అయినా ప్రేక్షకులను సర్‌‌ప్రైజ్ చేసేలా ఉండబోతోంది అంటున్నారు. ఇక మరో  గెటప్‌‌‌‌‌‌‌‌లో రఫ్ అండ్ రగ్డ్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నారట. యాక్షన్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే చెప్పగా, పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌ను కూడా టచ్ చేసినట్టు తెలుస్తోంది.

అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ క్యామిమో రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని, స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌లో తమన్నా, కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.   ఇది బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమా. ఊర్వశీ రౌతేలా, బాబీ డియోల్ ఇంపార్టెంట్ పాత్రలు పోషిస్తున్నారు.  శ్రీకర స్టూడియోస్ సమర్పణలో  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.