తెలుగు షోలలో ‘అన్‌స్టాపబుల్‌’.. బాలయ్య తగ్గేదేలే! 

తెలుగు షోలలో ‘అన్‌స్టాపబుల్‌’.. బాలయ్య తగ్గేదేలే! 

హైదరాబాద్: అఖండ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలకృష్ణ.. ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య ఇక్కడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు. ‘ఆహా’ వేదికగా ప్రసారమవుతోన్న ఈ షో.. తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీ.. టాప్ 10 రియాలిటీ షోలలో 5వ ప్లేస్ లో నిలిచి రికార్డు నెలకొల్పింది.

దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోల్లో ఒక తెలుగు రియాలిటీ షోగా బాలయ్య షో నిలిచింది. పలువురు స్టార్ హీరోలు, యంగ్ హీరోలతో కలసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఏడు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మరో మూడు ఎపిసోడ్లు పూర్తయితే.. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంటుందని సమాచారం. ఈలోపే 9.2 రేటింగ్ తో టాప్ 10లో నిలవడంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లోనే కాదు షోలలో కూడా బాలయ్య రికార్డ్స్ సృష్టిస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం:

మోడీ జీ.. 15 నిమిషాలు ఆగలేరా?

పోలీసుల విచారణకు రాఘవను అప్పగిస్తా

ఒమిక్రాన్ పై WHO హెచ్చరిక