బాక్సాఫీస్ బరిలో ముచ్చటగా మూడోసారి.. గెలుపెవరిది?

బాక్సాఫీస్ బరిలో ముచ్చటగా మూడోసారి.. గెలుపెవరిది?

సినిమా వాళ్లకి బెస్ట్ సీజన్ అంటే దసరా అనే చెప్పాలి. ఈ సీజన్ కోసం స్టార్ హీరోలందరూ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా వరుసగా పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధమవుతున్నాయి. సౌత్ నుండి ఈసారి మొత్తం నాలుగు భారీ సినిమాలు దసరా బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నాయి. అందులో తెలుగు నుండి ఇద్దరు స్టార్ హీరోలు రేస్ లో ఉన్నారు. 

అందులో ఒకటి నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా వస్తున్న భగవంత్ కేసరి(Bhagavanth kesari) కాగా.. రెండవది మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వర రావు(Tiger nageswara rao). ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆడియన్స్ కూడా ఈ రెండు సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ బాక్సాఫిస్ వార్ లో ఏ హీరో నెగ్గనున్నాడు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ఇద్దరు హీరోలు ఇప్పటివరకు మూడుసార్లు బాక్సాఫీస్ వార్ లో దిగారు. అందులో ముందుగా..  2008లో సంక్రాంతికి మెదటిసారి పోటి పడ్డారు బాలకృష్ణ, రవితేజ. వైవిఎస్ చౌదరి(YVS Chaudary) డైరక్షన్ లో బాలయ్య హీరోగా ఒక్కమగాడు(Okka magaadu) సినిమా రాగా..  రవితేజ  హీరోగా వివి వినాయక్(VV Vinayak) డైరక్షన్ లో కృష్ణ(Krishna) సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల్లో రవితేజ కృష్ణ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
 
ఇక రెండవసారి  2009లో బాలయ్య మిత్రుడు(Mitrudu) సినిమాతో రాగా .. రవితేజ కిక్(Kick) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో కూడా రవితేజనే విన్నర్ గా నిలిచాడు. ఆయన నటించిన కిక్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

ఇక చివరగా 2011 సంక్రాంతికి ముడోసారి పోటిపడ్డారు ఈ ఇద్దరు స్టార్ కానీ.. ఈసారి కూడా బాలయ్య సినిమాకు రిజల్ట్ మారలేదు. రవితేజ, హరిశ్ శంకర్(Harish shankar) కాంబోలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ మిరపకాయ్(Mirapakai) సూపర్ హిట్ కాగా.. బాలయ్య, దాసరి నారాయణ రావు(Dasari narayan rao) కాంబోలో వచ్చిన పరమవిరచక్ర(Paramaveera chakra) భారీ డిజాస్టర్ గా నిలిచింది. 

ఇక ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల తరువాత మరోసారి బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యారు బాలకృష్ణ, రవితేజ. మరి ఈసారి ఏ హీరో సినిమా విరాజయం సాదిస్తుందా అనేది క్యూరియాసిటీ ఆడియన్స్ లో నెలకొంది.