ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం పొడగింపు

ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం పొడగింపు

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని ఎలక్షన్ కమిషన్ పొడగించింది. ఫిబ్రవరి 11 వరకు రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం విధించింది. బహిరంగ సభలు, డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ విషయంలో రాజకీయ పార్టీలకు కాస్త ఊరటనిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే రాజకీయ సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యను 500 నుంచి 1000కి పెంచింది. ఇక ఇంటింటి ప్రచారంలో ఇప్పటి వరకు అభ్యర్థితో పాటు 10 మందికి మాత్రమే అనుమతించగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 20కు పెంచింది.

వైద్యారోగ్య శాఖ, రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించింది. కొవిడ్ 19 పరిస్థితిని సమీక్షించిన అనంతరం రాజకీయపార్టీల సభలు సమావేశాలపై నిర్ణయం తీసుకుంది. ఇండోర్లో నిర్వహించే సభల్లో గతంలో 300 మందికి మాత్రమే అనుమతి ఉండగా.. ఇప్పుడు 500 మందికి పర్మిషన్ ఇచ్చింది. 

For more news..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

ములాయం కాళ్లు మొక్కిన స్మృతి ఇరానీ