కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు : బండి సంజయ్

కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు :  బండి సంజయ్

పొరపాటున కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.  కేసీఆర్ కుటుంబం పేరుతో ఆర్టీసీ ఆస్తి పత్రాల రెడీ అయ్యాయన్న  సంజయ్..  99 ఏళ్ల లీజు పేరుతో ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  మొగ్దుంపూర్ లో ఎన్నికల ప్రచారంలో సంజయ్ పాల్గొన్నారు.  

ప్రజల పక్షాన యుద్దం చేస్తున్న తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని సంజయ్ అన్నారు.  సొమ్ము కేంద్రానైతే గంగుల కమాలాకర్ సోకు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దమ్ముంటే..   ఆర్వోబీ, స్మార్ట్ సిటీ సహా కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  ఈ సందర్భంగా మొగ్దంపూర్ లో వడ్ల బస్తాలను ఐకేపీ కేంద్రానికి తరలిస్తూ ట్రాక్టర్ నడపారు సంజయ్.