ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదు : బండి సంజయ్

 ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదు  :   బండి సంజయ్

ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ లో మిగిలేది ఆరుగురు నేతలేని అన్నారు కరీంనగర్ బీజేపీ  ఎంపీ  బండి సంజయ్. కరీంనగర్‌ జిల్లాలోని ఎంపీ కార్యాలయంలో చేపట్టిపన రైతు దీక్షను విరమించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  6 గ్యారంటీలను అమలు చేయకపోయినా రూ.600 కోట్లతో అమలు చేసినట్లుగా మీడియాలో యాడ్స్ ఇస్తూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని విమర్శించారు.  6 గ్యారెంటీల హామీలను అమలు చేయడం చేతకాదని కేంద్రానికి లేఖ రాసే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు.  చేతకాదని ఒప్పుకుంటే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు బండి సంజయ్.  

ALSO READ | అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతుండు : సీఎం రేవంత్ రెడ్ది

వరి వేస్తే ఉరే అన్న మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు బండి సంజయ్.  పంట నష్టపోతే నయాపైసా పరిహారమివ్వని వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు.  ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని మాట తప్పిన నేత కేసీఆర్..  రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పిన తరువాతే కేసీఆర్ కరీంనగర్ కు రావాలన్నారు.  రైతుల నట్టేట ముంచిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని కరీంనగర్ వస్తున్నారని సంజయ్ ప్రశ్ని్ంచారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ రైతులను మోసం చేసిన పార్టీలేనని అన్నారు సంజయ్.  రైతులకు అడుగడుగునా ఉంటూ పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు.