
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో రైతుల కోసం బీజేపీ నేతలు చేస్తున్న దీక్షను అర్థరాత్రి పోలీసులు భగ్నం చేయడాన్ని ఖండించారు పార్టీ చీఫ్ బండి సంజయ్. పెంచికలపెట్ మండలం కొండపెల్లిలో పేద రైతుల కోసం దీక్ష చేశారు బీజేపీ నేతలు. ఈ ఘటనలో బీజేపీ నేత పాల్వాయి హరీష్ పక్కటెముకులు ఫ్రాక్చర్ అయ్యాయి. మరో బీజేపీ నేత సత్యనారాయణకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. శాంతియుతంగా దీక్ష చేస్తున్న బీజేపీ నాయకులు, పేద రైతులపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల టీఆర్ఎస్ నేతలు కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేసినా పట్టించుకోని ప్రభుత్వం.. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పేద రైతులపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ ప్రజాస్వామ్య తెలంగాణాలో ఉందా?అరాచక రాజ్యంలో ఉన్నామా అని అన్నారు. తమ భూముల్ని లాక్కోవద్దంటే పోలీసులతో కొట్టిస్తారా? అని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. పేదల వ్యవసాయ భూముల సమస్య పరిష్కరించాలని తాను ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానన్నారు.