
అచ్చంపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్న ర్యాలీ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి అచ్చంపేట దాడే నిదర్శనమన్నారు. అచ్చంపేటలో బీజేపీ చేపట్టిన ర్యాలీపై దాడి జరగడంపై ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కార్పొరేషన్లు,మున్సిపాలిటీల్లో తాము ఒడిపోతున్నామని తెలిసి TRS నేతలు అసహనానికి గురవుతూ దాడులకు పాల్పడుతున్నారని ప్రెస్ నోట్ లో తెలిపారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తు TRS కు కొమ్ముకాయడం సరైంది కాదన్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు.
పోలీసులు బీజేపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారని..వచ్చేది బీజేపీ సర్కార్ అని అన్నారు బండి సంజయ్. దాడికి పాల్పడ్డ పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రెస్ నోట్ ద్వారా డిమాండ్ చేశారు.
గాయపడి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న కార్యకర్తలను స్థానిక బీజేపీ నేతలు పరామర్శించారు. ఇందులో 10మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.