బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే

బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ను మంగళవారం ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి, పాదయాత్ర ప్రముఖ్, సహ ప్రముఖ్ శ్రీ వీరేందర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, సుధాకర్ శర్మ,  చంద్రశేఖర్ హాజరై ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం పాదయాత్ర షెడ్యూల్ మీడియాకు విడుదల చేశారు. 

నియంతృత్వ కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసం బండి సంజయ్ శంఖారావం పూరిస్తూ చేపట్టనున్న పాదయాత్ర ఈనెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఆలయంలో పూజాదికాలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఎగ్జిబిషన్ మైదానంలో పాదయాత్ర ప్రారంభ సభ జరుగుతుంది. దారి మధ్యలో పబ్లిక్ గార్డెన్ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, అలాగే అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపానికి, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పిస్తారు. రాత్రికి షేక్ పేటలో బస చేస్తారు. 

25న షేక్ పేట, గోల్కొండ కోట, లంగర్ హౌజ్, బాపూఘాట్, అరె మైసమ్మగుడి, అజీజ్ నగర్, చిల్కూరు క్రాస్ రోడ్డు వరకు. పాదయాత్రలో భాగంగా గోల్కొండ కోట వద్ద,బాపూ ఘాట్ వధ్ద,అరె మైసమ్మ గుడి వద్ద సభలు జరుగుతాయి. మధ్యాహ్నం బాపూజీఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. చిలుకూరు క్రాస్ వద్ద రాత్రి బస.
26న చిలుకూరు క్రాస్ నుంచి మొయినాబాద్ మీదుగా తోలికట్ట వరకు పాదయాత్ర. మధ్యాహ్నం ఎంఎన్ సహారా వద్ద మధ్యాహ్న భోజనం, రాత్రికి కేతిరెడ్డిపల్లె గ్రీన్ కన్వెన్షన్ వద్ద బస. మొయినాబాద్ వద్ద మీటింగ్
27న కేతిరెడ్డిపల్లె నుంచి పాల్ గుట్ట, చేవెళ్ల వరకు పాదయాత్ర. మల్కాపురం వద్ద మధ్యాహ్న భోజనం, రాత్రికి చేవెళ్ల మోడల్ ఎన్.హెచ్ కాలనీ వద్ద బస. చేవెళ్ల వద్ద మీటింగ్
28న చేవెళ్ల ఎన్.హెచ్ కాలనీ నుంచి మిర్జాగూడ, మన్నెగూడ వరకు పాదయాత్ర. మన్నెగూడ క్రాస్ రోడ్డు వద్ద మీటింగ్.
29న మన్నెగూడ క్రాస్ రోడ్డు నుంచి శివారెడ్డిపేట,వికారాబాద్, మందనపల్లి వరకు పాదయాత్ర. వికారాబాద్ సమీపంలోని డెంటల్ కాలేజీలో మధ్యాహ్న భోజనం, రాత్రికి మందనపల్ల్లిలో రాత్రి బస. వికారాబాద్ వద్ద మీటింగ్.
30న మందనపల్లి నుంచి మోమిన్ పేట్ వరకు పాదయాత్ర, మోమోన్ పేట్ ఏఐఆర్ గార్డెన్ వద్ద రాత్రి బస. మోమిన్ పేట క్రాస్ రోడ్డులో మీటింగ్. 
31న మోమిన్ పేట్ నుంచి సదాశివ పేట్ వరకు పాదయాత్ర. సదాశివ్ పేటలో రాత్రి బస. మీటింగ్ సదాశివపేట క్రాస్ రోడ్డులో.
సెప్టెంబర్ 1న సదాశివపేట నుంచి సంగారెడ్డి వరకు పాదయాత్ర. సంగారెడ్డి స్టేడియంలో రాత్రి బస. మీటింగ్ సంగారెడ్డి క్రాస్ రోడ్డుతోపాటు అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా మీటింగ్.
2న సంగారెడ్డి నుంచి సుల్తానాపుర్ వరకు పాదయాత్ర, సుల్తానాపూర్ లో రాత్రి బస. ప్రజలతో ముఖాముఖి.
3న సుల్తానాపూర్ నుంచి జోగిపేట్ వరకు పాదయాత్ర, రాత్రి జోగిపేట్ లో బస. జోగిపేట హనుమాన్ విగ్రహం వద్ద మీటింగ్.
4న అన్నాసాగర్ నుంచి చింతకుంట, చిట్కుల్,ధుంపలకుంట,రంగంపేట వరకు పాదయాత్ర. రాత్రి బస, మీటింగ్ రంగంపేట.
5న రంగంపేట నుంచి సంగయ్యపేట్, చిన్న ఘన్ పూర్, పోతంశెట్టిపల్లె క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర. పోతంరెడ్డి క్రాస్ రోడ్డు వద్ద మీటింగ్. 
6న పోతంశెట్టి పల్లె క్రాస్ రోడ్డు నుంచి మెదక్ వరకు పాదయాత్ర. మెదక్ పట్టణంలో మీటింగ్.