
కేసీఆర్ పేదల పాలిట యముడిలా తయారయ్యాడన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ అంబేద్కర్ ను పట్టించుకోలేదన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని దళిత ద్రోహి ఎలుతున్నాడన్నారు.కేసీఆర్ కు అంబేద్కర్ వర్ధంతి, జయంతి వేడుకలు గుర్తుకు రావా అని ప్రశ్నించారు.ఆయన విగ్రహానికి పూలమాలలు ఎందుకు వేయరో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ భారతీయులకు , తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.