ఎంపీగా ఉన్న టైంలో కేసీఆర్ పెద్ద తప్పు చేశాడన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బేగంపేట జురిస్టియన్ క్లబ్ లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో సంజయ్ పాల్గొన్నారు. పార్లమెంట్ కు వెళ్లకుండా KCR వేరొకరితో సంతకం చేయించాడని సంజయ్ ఆరోపించారు. ఎంపీగా ఉండి వేరోకరితో సంతకం ఎలా చేయిస్తారని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ తాను చేసిన తప్పుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. కేసీఆర్ ను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు.
భైంసా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. హైదరాబాద్ యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న భైంసా బాధితులను ఆయన పరామర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భైంసాలో పర్యటించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని కోరారు.