జైలుకు వెళ్తే ఎలా ఉండాలో కేసీఆర్ ప్రాక్టీస్ చేస్తుండు

జైలుకు వెళ్తే ఎలా ఉండాలో కేసీఆర్ ప్రాక్టీస్ చేస్తుండు

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు పోడుభూముల ఘటనలో అరెస్టయి  బెయిల్ పై విడుదలైన కార్యకర్తలు, నేతలకు అండగా ఉంటామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ తో కలిసి సూర్యాపేట జిల్లా హుజూరునగర్ లో పర్యటించారు. లక్ష్మి గార్డెన్ లో జైలు నుంచి రిలీజ్ అయిన కార్యకర్తలు, నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన బండి సంజయ్.. అధైర్య పడొద్దని, అన్ని రకాల సహాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. గుర్రంబోడులో టీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన భూములు గిరిజనులకు దక్కేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి  బయటకు రాకుండా జైలుకు వెళ్తే ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేస్తున్నాడన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.  కేసీఆర్ సంగతేందో చూస్తామన్నారు. పేద గిరిజనులను ఏ విధంగా వేధించారో నాగార్జున సాగర్ లో గ్రామగ్రామన తిరిగిచెబుతామన్నారు.