బీజేపీ ఒత్తిడి వల్లే పీఆర్సీ ప్రకటన

బీజేపీ ఒత్తిడి వల్లే  పీఆర్సీ ప్రకటన

బీజేపీ ఒత్తిడి వల్లనే సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్రకటించారన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గతంలో ఇచ్చిన 43 శాతం కంటే ఎక్కువ ఫిట్ మెంట్ వస్తుందని ఆశించిన ఉద్యోగులందరిని సీఎం ప్రకటన నిరాశకు గురిచేసిందన్నారు. కనీసం 44శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. పీఆర్సీ కమిటీ వేసిన నాటి నుంచి పూర్తిగా మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినప్పుడే ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. పీఆర్సీ పెంపు వేతనం కేవలం 12 నెలలు మాత్రమే ఇస్తామని, అది కూడా రిటైర్ మెంట్ తర్వాత ఇస్తామనడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసం చేసినట్లే అవుతుందని చెప్పారు. పదవీ విరమణ వయసు పెంపు సాకుతో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక పోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామన్నారు బండి సంజయ్.