ఈ నెల 21 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర రెండో దశ

 ఈ నెల 21 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర రెండో దశ

 ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు ప్రజాసంగ్రామ పాదయాత్ర రెండో దశ  ఉంటుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.50 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. మొత్తం 16 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టబోతున్నట్లు చెప్పారు. 2022లోనే అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తవుతుందన్నారు మనోహర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడిన బండి సంజయ్.. హుజురాబాద్ బైపోల్ లో కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు . ఇదే స్పూర్తితో పనిచేస్తే 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.  30 వేల ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలవబోతున్నారన్నారు. ఈనెల 12న ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ చేపడుతున్నట్లు చెప్పారు.నిరుద్యోగులంతా మిలియన్ మార్చ్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు.