సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాక్ లో కలిసేది

సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాక్ లో కలిసేది

తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. బీజేపీ  ఆధ్వర్యంలో నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారని.. ప్రగతి భవన్‌కు బీజేపీ  జయధ్వానాలు వినిపించాలన్నారు. తెలంగాణ విమోచన వీరుల చరిత్రను భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకే నిర్మల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామన్నారు. సర్దార్ పటేల్‌ లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదన్నారు. TRS కార్యకర్తల్లో తెలంగాణ రక్తం ప్రవహిస్తే కేసీఆర్ ప్రభ్యత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. 

కేసీఆర్ లాంటి మూర్ఖుడు ప్రధాని అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరపడని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి కుటుంబాన్ని కూకటి వేళ్ళతో పెకిలివేస్తామని స్పష్టం చేశారు.అమరుల త్యాగలతో పాటు కేసీఆర్ క్రూరత్వాన్ని కూడా పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామన్నారు. మూర్ఖుడి చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి అర్థనాదం పెడుతోందన్నారు. మోడీ, అమిత్ షా లేని దేశాన్ని ఉహించుకోలేమని.. అవకాశం ఉంటే నా ఆయుష్ కూడా  వారికే ఇస్తానని అన్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మహానుభావుడు అమిత్ షా అని అన్నారు బండి సంజయ్.