మోడీ సహకారం వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు

మోడీ సహకారం వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు

తెలంగాణ చారిత్రక గొప్పతనాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధాని మోడీ సహకారం వల్లే తెలంగాణలోని చారిత్రక రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కిందన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మొదటి బహుమతిగా భావిస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో అవకాశాలు తెలంగాణకు కిషన్ రెడ్డి కల్పిస్తారని ఆశిస్తున్నానన్నారు. యునెస్కో సభ్య దేశాలతో ఏకాభిప్రాయం సాధించడానికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేశారన్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకొని.. వెంటనే చర్యలు తీసుకున్నారన్నారు. అన్ని దేశాల ఏకాభిప్రాయంతోనే ఇది సాధ్యమైందన్నారు సంజయ్. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో తెలంగాణలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. 

ప్రసిద్ధ రామప్ప గుడికి వారసత్వ గుర్తింపు దక్కడం సంతోషకరమన్నారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. రామప్పగుడికి యునెస్కో గుర్తింపు రావడానికి ప్రధాని మోడీ మార్గదర్శనమే కారణమన్నారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.