
తెలుగు రాజకీయాలు ఉన్నంత కాలం రోశయ్య పేరు చిరస్మరణీయంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆర్థిక శాఖ అంటేనే.. రోశయ్య గుర్తుకు వస్తారని ఆయన అన్నారు.
‘రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. రోశయ్యను చూస్తే నిండు తెలుగుతనం కనిపిస్తుంది. విపక్షాళను నొప్పించకుండా సమాధానం చెప్పేవారు. ప్రతిపక్షాలను కూడా ఆకర్శించేవారు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఆయన ప్రసంగాలు వినేవాడిని. ఎలాంటి అవినీతి ఆరోపణలు, మచ్చ లేని మనిషి. వారిని నేనెప్పుడూ కలవక పోయినప్పటికీ.. బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు, అసెంబ్లీలో ఉన్నప్పుడు టీవీల్లో చూసేవాడిని. ఉమ్మడి ఏపీకి ఆయన ఎన్నో సేవలు అందించారు. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను’ అని సంజయ్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది.https://t.co/a9BhVDb4BN pic.twitter.com/egZSxZj66k
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 5, 2021