ముఖ్యమంత్రిది ముందు చూపా మందు చూపా?

ముఖ్యమంత్రిది ముందు చూపా మందు చూపా?

మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ  అక్రమ పద్ధతుల్లో గెలిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు. పోలీసులు, డీజీపీ నిష్పక్షపాతంగా వ్యవహరించి క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రాజకీయంగా కేంద్రంపై విమర్శలు  చేస్తుందన్నారు. ఆస్పత్రిలో డబ్బులు కట్టలేక చనిపోతుంటే... దీనికి కూడా కేంద్రమే కారణమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిది ముందు చూపా లేక మందు చూపా అని అన్నారు. 80 శాతం మందికి వ్యాక్సిన్ కేంద్రం ఇస్తుందని..2500 కోట్లు వ్యాక్సిన్ కి ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. పీఎం కేర్ లెక్కలు ఉన్నాయని..CMRF ఎక్కడ ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో  చేర్చి..  పేదల ప్రజలను కాపాడాలన్నారు బండి సంజయ్. ప్రైవేట్ ఆస్పత్రులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అదనపు డబ్బులు ఇస్తే తప్పేంటన్నారు. KCR, KTR అబద్ధాలను ఎవరు నమ్మడం లేదన్నారు. అంతేకాదు మంత్రి ఈటలతో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారన్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎం చెప్పాడా? అసలు సీఎం వ్యాక్సిన్ తీసుకున్నాడా అని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ రేట్స్ పై భారత్ బయోటెక్ తో కేసీఆర్ మాట్లాడొచ్చు కదా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కేసులను, కరోనా మరణాలను తగ్గించి చూపుతోందన్నారు. 

యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం..ఒక్క వెంటిలేటర్ అయిన రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్ లను కూడా ఓపెన్ చేయలేదన్నారు. ప్రజలను కాపాడాలి కానీ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనాను అరికట్టే విషయంలో కలిసి మెలసి పని చేద్దామన్న సంజయ్ కేంద్రాన్ని తిట్టడం మానుకోవాలన్నారు. వాస్తవ లెక్కలు చెబితే రాష్ట్రానికి.. కేంద్రం అన్ని అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కరోన సహాయం కోసం బీజేపీ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.