దమ్ముంటే మిలియన్ మార్చ్‌ను అడ్డుకోండి

దమ్ముంటే మిలియన్ మార్చ్‌ను  అడ్డుకోండి

ఎన్ని ప్రలోభాలు పెట్టినా..హుజురాబాద్ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోలేదన్నారు. ఈటల రాజేందర్ విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన.. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయబోతున్నామన్నారు.  దమ్ముంటే మిలియన్ మార్చ్ ను అడ్డుకోవాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు బండిసంజయ్. తగ్గించకుంటే గల్లీగల్లీలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.. ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్నిప్రారంభిస్తున్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అన్నారు బండి సంజయ్.