
దళితుడిగా పుట్టకపోయింనందుకు బాధగా ఉందన్న బండి సంజయ్.. వచ్చే జన్మలోనైన దళితుడిగా పుట్టాలని కోరుకున్నారు. దళితుడిగా పుడితే సైలెంట్ గా కూర్చోకుండా.. పోరాటం చేస్తానన్నారు. దళితులు ఏకమై కేసీఆర్ పై పోరాటం చేద్దామన్నారు. అమర వీరుల కుటుంబాలను కేసీఆర్ మర్చిపోయి ఆయన కుటుంబానికి మాత్రం పదవులు ఇచ్చుకున్నాడన్నారు. దళితుడిని సీఎం చేస్తానని తానే ముఖ్యమంత్రి అయ్యిండని గుర్తు చేశారు. దళితులు, బడుగు బలహీనర్గాలు ఏకం కావాలన్నారు. ఉద్యోగులకు ఎన్నడూ అపాయిట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఎన్నికలు రాగానే రప్పించుకున్నారన్నారు. కేసీఆర్ హామీలను నమ్మొద్దని..13 వేల కంపెనీలను ఏర్పాటు చేశామంటున్న కేసీఆర్ ఆ లిస్ట్ ఇవ్వాలన్నారు. ఒకే వేళ నిజంగానే 13 వేల కంపెనీలు ఏర్పాటు చేస్తే కేసీఆర్ కు పల్లకి సేవ చేస్తానన్నారు.