
తెలంగాణలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. ఈ క్రమంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు నేతలు క్యూ కట్టారు. ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డి నివాసంలో సినీ నటుడు బండ్ల గణేశ్ భేటీ అయ్యారు . ఈ సందర్బంగా మాట్లాడిన బండ్ల గణేశ్ కాంగ్రెస్ కు 90 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సునామీ వస్తుందన్నారు. కాంగ్రెస్ లో చాలా మంది గొప్ప నేతలు ఉన్నా.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని చెప్పారు. తాను కాంగ్రెస్ లో సాధారణ కార్యకర్తగా ఉంటానని చెప్పారు.
డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల ముందు కేంద్ర,రాష్ట్ర బలగాలతో మూడంచెల్ భద్రత ఏర్పాటు చేసింది. లోపలా బయటా సీసీ కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా పెట్టింది.