
ఎయిర్ హోస్టెస్ తనను ప్రేమించడం లేదని ఆమె చెవిని కోసేశాడు ఓ రౌడీ. ఇది కర్ణాటక లోని బెంగళూరు లో జరిగింది. బెంగళూరులోని జాలహళ్లిలో నివసిస్తున్న యువతి ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తుంది. అదే ప్రాంతానికి చెందిన అజయ్ అలియాస్ జాకీ అనే రౌడీ షీటర్ తనను ప్రేమించాలని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె పేరెంట్స్ అజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు.. రెచ్చిపోయిన అజయ్ ఆమె ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న వస్తువులను తలుపులను అద్ధాలను పగులకొట్టాడు.
ఈ నెల13వతేదీ అర్ధరాత్రి ఉద్యోగం పూర్తిచేసుకుని క్యాబ్ లో ఇంటికి వస్తుంది ఎయిర్ హోస్టెస్. ఆమె ప్రయాణిస్తున్న క్యాబ్ హెబ్బాళ్ ఫ్లై ఓవర్ పైకి రాగానే.. కారును ఆపి డ్రైవర్ ను కత్తితో బెధిరించి క్యాబ్ లోంచి బయటకు పంపిచాడు అజయ్. క్యాబ్ వెనకాల సీట్ లో కూర్చుని ఉన్న ఎయిర్ హోస్టెస్ ను వేధిస్తూ ప్రేమించాలని కోరాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చెవిని కోసి అక్కడినుంచి గాయబ్ అయ్యాడు. బాధితురాలు నగర పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసింది. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.