
ఇటీవల కోల్ కతాలో జరిగిన బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో కోల్ కతా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హత్య జరిగిన అపార్టెమెంట్ లో సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనంలోనే అన్వరుల్ చివరిసారిగా కనిపించాడు.. అయితే ఈ బంగ్లాదేశ్ ఎంపీ హత్య వెనకు హానీ ట్రాప్ జరిగినట్లు .. ఈ కేసులో ఓ మహిళ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అన్వరుల్ ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పారవేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు ఆకుపచ్చ ట్రాలీ బ్యాగ్, ప్లాస్టిక్ ప్యాకెట్లతో కనిపించారు. అయితే ఈ ఫుటేజీ హత్యకు ముందు లేదా తర్వాత ఉన్నదా..అపార్ట్‌మెంట్ లోపలనుంచి వచ్చిందా..వెలుపల నుండి వచ్చినదా అనేది స్పష్టంగా తెలియలేదు. అనార్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి - చర్మం ఒలిచి, ఎముకలు కోసి సంచు లు, ప్లాస్టిక్ ప్యాకెట్లలో తీసుకెళ్ళి ఉంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బంగ్లాదేశ్‌లోని ది డైలీ స్టార్‌లోని ఒక నివేదిక ప్రకారం..ఎంపీని ఒక మహిళ న్యూ టౌన్ ఫ్లాట్‌లోకి ఎట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్ కిల్లర్స్ చేత హత్య చేయబడ్డారని పశ్చిమ బెంగా ల్ నేర పరిశోధన విభాగం (CID) అనుమానిస్తోంది. షిలాస్తి రెహమాన్ అనే మహిళ స్కానర్‌లో కనిపించిందని, హత్యకు ప్రధాన సూత్రధారితో ఆమె సన్నిహితంగా ఉంద ని అనేక మీడియా సంస్థలు నివేదించాయి. ఆమెను ఢాకాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని అధికారులు సరిహద్దు ఉత్తర 24 పరగానాస్ జిల్లా నుంచి బంగ్లాదేశ్ జాతీయుడు జిహాద్ హవ్లాదర్‌ను అరెస్టు చేశారు. అనార్ హత్య కేసులో ఇతడే ప్రధాని నిందితుడిగా అనుమానిస్తున్నారు. మరో నలుగురితో కలిసి అన్వరుల్ అజిమ్ ను హత్య మార్చినట్లు హవ్లాదార్ ఒప్పుకున్నట్లు పోలీసులు చెపు తున్నారు. ఈ కేసులో సరిహద్దు వెంబడి బంగ్లాదేశ్ అధికారులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే హత్య వెనుక ఉద్దేశ్యంపై వెంటనే సమాచారం లేదు.
అమెరికా పౌరుడైన ఎంపీ సన్నిహితుడు అక్తరుజ్జమాన్ షాహిన్ ఈ నేరంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు కిల్లర్లకు రూ. 5 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక విచార ణలో తేలిందని సీనియర్ పోలీసు అధికారిని తెలిపారు. అన్వరుల్ ను హానీ ట్రాప్ చేసిన షిలాస్తి రెహమాన్‌కి షాహిన్‌తో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాన నిందితుడు హవ్లాదార్ వృత్తిరీత్యా మటన్ అమ్ముతుంటాడు. అన్వరుల్ రాకముందే రెండు నెలల క్రితం కోల్ కతా వచ్చాడు. అన్వరుల్ రాకకోస ఇక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. మే 12 న పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టిన అన్వరుల్.. మొదట బారానగర్ ప్రాంతంలో ఒక స్నేహితుడితో ఉన్నాడు. అతను మరుసటి రోజు న్యూ టౌన్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో చివరిగా కనిపించాడు.
అయితే షిలాస్తి రెహమాన్.. అనర్వుల్ స్నేహితుడైన అక్తరుజ్జమాన్ షాహిన్ కూడా సన్నిహితంతా ఉండేదని.. ఆమె హానీ ట్రాప్ లో అన్వరుల్ పడినట్టు బంగ్లాదేశ్ పార్లమెంటేరియన్ భావిస్తోంది. ఆ మహిళ అన్వరుల్ ను కోల్ కతా లని న్యూటౌన్ కు రప్పించినట్లు తెలుస్తోంది. ఫ్లాట్ వెళ్లిన వెంటనే హత్య చేసినట్లు అనుమానిస్తున్న బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు.