లోన్​ కట్టలేదని కుర్చీలు ఎత్తుకెళ్లిన్రు

లోన్​ కట్టలేదని కుర్చీలు ఎత్తుకెళ్లిన్రు
  •     ఎన్​డీసీసీబీ అధికారుల తీరుతో ఆందోళనలో రైతులు

నస్రుల్లాబాద్, వెలుగు: లోన్​ కట్టలేదని రైతుల ఇంటికి వెళ్లి ఎన్​డీసీసీబీ ఆఫీసర్లు కుర్చీలు ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్​ మండలం అంకోల్ గ్రామానికి చెందిన పసుపుల లక్ష్మణ్, సాయవ్వ, పెద్ద కాపు మోహన్ నిజామాబాద్​ డిస్ట్రిక్ట్​ కోఆపరేటివ్ ​సెంట్రల్ ​బ్యాంక్​(ఎన్​డీసీసీబీ)లో లోన్ ​తీసుకున్నారు. టైంకు లోన్​కట్టలేకపోయారు. శనివారం ఎన్​డీసీసీబీ ఆఫీసర్లు లక్ష్మణ్​ఇంటికి వెళ్లి ల్యాప్ టాప్​స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్​గ్రామంలో అప్పు చేసి కొంత లోన్​ కట్టడంతో అతడి ల్యాప్​టాప్ ​తిరిగిచ్చారు. సాయవ్వ, మోహన్​ఇంటికి వెళ్లి కుర్చీలను తీసుకెళ్లారు. ప్రస్తుతం వచ్చే పంట డబ్బులతో లోన్​ తీరుస్తామని రైతులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మంగళవారం వరకు మొత్తం బాకీ తీర్చాలని లేదంటే ఇంటి తలుపులతో సహా తీసుకెళ్తామని హెచ్చరించారు.