జనవరి 2024లో బ్యాంకులకు 11రోజులు సెలవులు

జనవరి 2024లో బ్యాంకులకు 11రోజులు సెలవులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ సెలవు జాబితా ప్రకారం ఈ నెలలో రెండో, నాలుగో శని, ఆదివారాలు కాకుండా మొత్తం 11రోజుల పాటు దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

నిర్దిష్ట పండుగల విషయంలో, ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల సమయంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. ఈ రాబోయే సెలవుల్లో ఆయా శాఖలు మూతపడినప్పటికీ, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI), ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు ఎటువంటి అంతరాయాలు లేకుండా పనిచేస్తాయి.

జనవరి 1  - సోమవారం -    కొత్త సంవత్సరం - పలు రాష్ట్రాల్లో
జనవరి 11 - గురువారం - మిషనరీ డే - మిజోరం
జనవరి 12 - శుక్రవారం - స్వామి వివేకానంద జయంతి - పశ్చిమ బెంగాల్
జనవరి 13 - శనివారం - లోహ్రి - పంజాబ్, పలు రాష్ట్రాలు
జనవరి 14 - ఆదివారం - మకర సంక్రాంతి- పలు రాష్ట్రాలు
జనవరి 15 - సోమవారం- పొంగల్ - తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
జనవరి 15 - సోమవారం - తిరువల్లువర్ దినోత్సవం - తమిళనాడు
జనవరి 16 - మంగళవారం - తుసు పూజ - పశ్చిమ బెంగాల్, అస్సాం
జనవరి 17 - బుధవారం- గురు గోవింద్ సింగ్ జయంతి- పలు రాష్ట్రాల్లో
జనవరి 23 - మంగళవారం-సుభాష్ చంద్రబోస్ జయంతి - అనేక రాష్ట్రాలు
జనవరి 26 - శుక్రవారం - గణతంత్ర దినోత్సవం - దేశమంతటా
జనవరి 31 - బుధవారం - మీ-డ్యామ్-మీ-ఫై- అస్సాం