
న్యూఢిల్లీ: బ్యాంక్ పనులేమైనా ఉంటే ఈ వారం తొందరగా పూర్తి చేసుకోవడం బెటర్. హోలి, వీకెండ్ వలన కొన్ని రాష్ట్రాల్లో వరసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉంటాయి. హోలిక దాహన్ సందర్భంగా ఉత్తరాఖాండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో ఈ నెల 17 న (గురువారం) బ్యాంకులకు హాలిడే. హోలి సందర్భంగా ఈ నెల 18 న (శుక్రవారం) తెలంగాణ, గుజరాత్, మిజోరామ్, మధ్యప్రదేశ్, ఛండిగడ్, ఉత్తరఖాండ్, సిక్కిం, అస్సాం, రాజస్తాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, బిహార్, గోవా, ఛత్తీస్‌గడ్, మేఘాలయా, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులకు హాలిడే. ఆదివారం కావడంతో 20 న బ్యాంకులకు సెలవు.