50 పైసల కోసం తలుపులకు నోటీసులంటించిన బ్యాంకు సిబ్బంది

50 పైసల కోసం తలుపులకు నోటీసులంటించిన బ్యాంకు సిబ్బంది

దేశంలో పేరుమోసిన వ్యాపారవేత్తలు కోట్లకుకోట్లు ఎగ్గొట్టి ఏంచక్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, ఒక మాములు వ్యక్తి 50 పైసలు కట్టలేదని అతని ఇంటికి నోటీసులు అంటించారు ఒక పబ్లిక్ బ్యాంకు సిబ్బంది. ఈ ఘటన రాజస్థాన్ జున్‌జుహ్నుజిల్లా ఖేత్రిలో జరిగింది. స్థానికంగా నివసించే జితేంద్ర సింగ్ అనే వ్యక్తి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. బ్యాంకు సిబ్బంది ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌లో జితేంద్ర తాను తీసుకున్న లోన్ మొత్తాన్ని చెల్లించాడు, కానీ ఒక 50 పైసలు మాత్రం కట్టకుండా వదిలేశాడు. కొన్నిరోజుల తర్వాత బ్యాంకు సిబ్బంది జితేంద్ర ఇంటికి 50 పైసలు చెల్లించాలంటూ అతని ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. జితేంద్ర ప్రస్తుతం వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు. అందుకే తన తండ్రి వినోద్ సింగ్‌ను డబ్బు కట్టమని బ్యాంకుకు పంపిచాడు. అయితే అక్కడి సిబ్బంది మాత్రం 50 పైసలు డిపాజిట్ చేసుకోమని అంటున్నారట. డబ్బు కట్టాలని నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు కట్టడానికి వస్తే తీసుకోమంటున్నారని జితేంద్ర తండ్రి వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పబ్లిక్ బ్యాంక్ 50 పైసల కోసం తన తలుపు మీద నోటీసును ఎలా అతికించింది, ఆపై దానిని తీసుకోవడానికి ఎందుకు నిరాకరించింది అని జితేంద్ర సింగ్ బ్యాంకుపై కేసు పెడతానని అంటున్నారు.

‘బ్యాంక్ సిబ్బంది 50 పైసల కోసం నోటీసు పంపారు. నా క్లయింట్ ఆ డబ్బు చెల్లించి బ్యాంకు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసి) తీసుకోవడానికి వచ్చారు. సిబ్బంది ఆ డబ్బును జమ చేసుకోవడానికి నిరాకరించారు. మేము బ్యాంక్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము’ అని జితేంద్రసింగ్ తరపు న్యాయవాది విక్రమ్ సింగ్ తెలిపారు.

For More News..

పెన్ను కోసం ఫ్రెండునే చంపింది

షాకింగ్ వీడియో: కారుతో గుద్ది అలాగే రోడ్డుపై ఈడ్చుకెళ్లి..