బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌‌‌‌‌‌‌‌-II/ ఎస్‌‌‌‌‌‌‌‌ఎంజీఎస్‌‌‌‌‌‌‌‌-IV/ ఎంఎంజీఎస్‌‌‌‌‌‌‌‌-III) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 10వ తేదీలోగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఖాళీలు: మొత్తం 143 పోస్టుల్లో క్రెడిట్ ఆఫీసర్: 25, చీఫ్ మేనేజర్: 9, లా ఆఫీసర్: 56, డేటా సైంటిస్ట్:2, ఎంఎల్‌‌‌‌‌‌‌‌ ఓపీఎస్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ స్టాక్ డెవలపర్: 2, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్: 2, డేటా క్వాలిటీ డెవలపర్: 2, డేటా గవర్నెన్స్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్: 2, ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం ఇంజినీరింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌: 2, లైనక్స్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేటర్: 2, ఒరాకిల్ ఎక్సాడాటా అడ్మినిస్ట్రేటర్: 2, సీనియర్ మేనేజర్: 35, ఎకనమిస్ట్‌‌‌‌‌‌‌‌: 1,  టెక్నికల్ అనలిస్ట్: 1 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్, డిగ్రీ, పీజీ, పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం తప్పనిసరి ఉండాలి. నెలకు ఎంఎంజీఎస్‌‌‌‌‌‌‌‌-II పోస్టులకు రూ.48,170- నుంచి 69,810.  ఎస్‌‌‌‌‌‌‌‌ఎంజీఎస్‌‌‌‌‌‌‌‌-IV పోస్టులకు రూ.76010- నుంచి  రూ.89890. ఎంఎంజీఎస్‌‌‌‌‌‌‌‌-III పోస్టులకు రూ.63840 నుంచి- రూ.105280 జీతం చెల్లిస్తారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, మొహాలి, చెన్నై, దేహ్రాదూన్, దిల్లీ, గువాహటి, హైదరాబాద్/ సికింద్రాబాద్.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  జనరల్​ అభ్యర్థులు రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175) అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.bankofindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.