
- మొదటి సారి లోన్లు తీసుకుంటే సిబిల్ స్కోర్ అవసరం లేదు: స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: మొదటి సారి లోన్లు తీసుకునేవారికి మినిమమ్ సిబిల్ స్కోర్ ఉండాల్సిన అవసరం లేదని లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ, క్రెడిట్ స్కోరు లేకపోయినా బ్యాంకులు రుణ దరఖాస్తులను తిరస్కరించలేవని స్పష్టం చేశారు. అయితే, సిబిల్ స్కోరు తప్పనిసరి కాకపోయినా, బ్యాంకులు దరఖాస్తుదారులపై బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్స్ చేయాలని సూచించారు.
ఇందులో క్రెడిట్ హిస్టరీ, రుణ చెల్లింపుల వివరాలు, రీ-స్ట్రక్చర్, రైటాఫ్ వంటి అంశాలు పరిశీలించాలి. సిబిల్ స్కోరు అనేది 300–900 మధ్యలో ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది వ్యక్తి క్రెడిట్ విలువను సూచిస్తుంది. ఆర్‌బీఐ ప్రకారం, క్రెడిట్ స్కోరు వివరాలు అందించేందుకు క్రెడిట్ బ్యూరోలు యూజర్ నుంచి రూ.100 కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి ఉచితంగా పూర్తి క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వాలి.