బంగారంపైనే కాదు..ఇకపై వెండిపైనా అప్పులు

బంగారంపైనే కాదు..ఇకపై వెండిపైనా అప్పులు

న్యూఢిల్లీ: బంగారంపై మాదిరిగానే వెండినీ తాకట్టు పెట్టుకొని లోన్లు ఇస్తామని ఆర్​బీఐకి బ్యాంకులు ప్రతిపాదించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పాలసీ ఫ్రేమ్​వర్క్​ను తయారు చేయాలని కోరాయి. నగల  ఎగుమతిదారులు వీటిని ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. గత ఏడాది వెండి  నగల ఎగుమతులు 16 శాతం పెరగడంతో బ్యాంకులు ఈ ప్రపోజల్​ను ముందుకు తెచ్చాయి. వెండి, వెండి వస్తువులపై లోన్లు ఇవ్వాలని చాలా కాలంగా ఎగుమతిదారులు/తయారీదారులు బ్యాంకులను అడుగుతున్నారు. 

వెండిపైనా లోన్లు ఇవ్వాలని, ఈ విషయమై ఆర్​బీఐ దగ్గరికి వెళ్లాలని గత నెల జరిగిన సమావేశంలో నిర్ణయించామని బ్యాంక్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. వెండి ఎగుమతులు విలువ రూ.25 వేల కోట్లు దాటిందని, ఈ సెక్టార్​ నుంచి లోన్లకు చాలా డిమాండ్​ ఉందని వివరించారు. ‘‘గోల్డ్​ లోన్లకు ఉన్నట్టే వెండి లోన్లపైనా రిస్కులు ఉంటాయి. ఈ సెగ్మెంట్ ​వార్షిక వృద్ధి 14–15 శాతం వరకు ఉంది. అందుకే గోల్డ్​ లోన్ల మాదిరే వెండి లోన్లకూ రూల్స్​ ఉండాలి.  బంగారం మాదిరే వెండి కూడా చాలా విలువైన లోహం. ఇండస్ట్రియల్​ సెక్టార్​లో దీనిని విరివిగా వాడుతారు. నగల ఎగుమతిదారుల నుంచి లోన్లకు బాగా డిమాండ్​ ఉంది”అని ఆయన వివరించారు. 

విపరీతంగా పెరుగుతున్న డిమాండ్​

సిల్వర్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ లెక్కల ప్రకారం 2022లో ప్రపంచ వెండి డిమాండ్ 1.21 బిలియన్ ఔన్సుల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.    వెండి మార్కెట్ ఈ సంవత్సరం కూడా లోటును నమోదు చేస్తుందని అంచనా. గత 10 సంవత్సరాలుగా వెండి సరఫరా లోటు క్రమంగా పెరుగుతోంది. ఇది  2021 నుంచి 2022 వరకు 300 శాతానికి పైగా పెరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్​ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  ఇంటీరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో వెండిని ఉపయోగించడం వల్ల వెండికి డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం,  ఫెడ్ వైఖరి వంటివి వెండి ధరలకు  ఊతమిస్తాయని కోటక్​ సెక్యూరిటీస్​కు చెందిన రవీంద్ర రావు చెప్పారు. ఇప్పుడున్న రూల్స్​ ప్రకారం నామినేటెడ్​ బ్యాంకులు బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. గోల్డ్​మానిటైజేషన్​ స్కీములను కస్టమర్లకు అందించవచ్చు. గోల్డ్​ లోన్లను రూపాయల్లోనే తిరిగి చెల్లించాలి. 

బంగారం విలువకు సమానంగా అప్పు ఇస్తారు. అయితే కొన్ని షరతులకు లోబడి ఈఎంఐలను బంగారం రూపంలో చెల్లించవచ్చు. కనీసం కేజీ బంగారం అయినా ఇవ్వాలి. వెండి లోన్లకూ ఇలాంటి రూల్స్​నే వర్తింపజేయవచ్చని మరో బ్యాంకు ఎగ్జిక్యూటివ్​ చెప్పారు. జెమ్​ జ్యూయలరీ ఎక్స్​పోర్ట్ ప్రమోషన్​ కౌన్సిల్​(జీజేఈపీసీ) లెక్కల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో వెండి నగల దిగుమతుల విలువ 16 శాతం పెరిగి రూ.23,492.71 కోట్లకు చేరింది. అంతకుముందు సంవత్సరంలో వీటి విలువ రూ.20,248.09 కోట్లుగా ఉంది. రూల్స్​ను పాటించకుండా సరైన పర్యవేక్షణ లేకుండా బ్యాంకులు గోల్డ్​ లోన్లు ఇవ్వకూడదని ఆర్​బీఐ హెచ్చరించింది. కొందరు జ్యూయలర్లు గోల్డ్​ లోన్ల డబ్బును వ్యాపారం కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వాడుతున్నారని పేర్కొంది. బ్యారోవర్ల ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్​ హిస్టరీ, మాన్యుఫాక్చరింగ్​ యాక్టివిటీస్​, కొల్లటేరల్​ సెక్యూరిటీస్​ వంటి వాటిని పరిశీలించిన తరువాతే లోన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది.