బ్యాంక్‌‌‌‌ల నెత్తిన మరో బాంబ్​?

బ్యాంక్‌‌‌‌ల నెత్తిన మరో బాంబ్​?

వొడాఫోన్ ఐడియా ఈ పేరు తెలియని వారుండరు. మొబైల్ వాడే చాలా మంది వద్ద ఈ కంపెనీల సిమ్ ఉంటుంది. ఇక టాటా మోటార్స్..  రోడ్లపై తిరిగే చాలా కార్లు వీరివే. జీఎంఆర్ ఇన్‌‌ఫ్రా, అదానీ పవర్, జిందాల్ స్టీల్.. ఇవన్నీ వాటి రంగాల్లో టాప్ మోస్ట్ కంపెనీలుగా పేరున్నవి. కానీ వీటి పరిస్థితి  ప్రస్తుతం ఏం మాత్రం బాగోలేదు. ఇవే కాదు మరికొన్ని టాప్ కంపెనీల పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది. వీటి మార్కెట్ క్యాప్‌‌ను( కంపెనీ మొత్తం షేర్ల విలువను) మించి పోయి అప్పులు పెరిగిపోయాయి. 195 నాన్ ఫైనాన్సియల్, నాన్ గవర్న్‌‌మెంట్ సంస్థలు తీసుకున్న అప్పులు.. ఆయా సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌ను  మించిపోయాయని తాజా లెక్కల్లో తేలింది. వీటి అప్పుల మొత్తం రూ. 13 లక్షల కోట్లకు చేరుకుంది. 2018 చివరి నాటికి మార్కెట్‌‌ క్యాపిటలైజేషన్‌‌ను మించి అప్పులున్న కంపెనీలు 99 ఉంటే.. అవి 2019 మార్చి నాటికి 147కు పెరిగాయి. ఇవి తాజాగా 195కు చేరుకున్నాయి.  గత ఐదేళ్లలో ఈ అమౌంట్ చాలా ఎక్కువని ఆర్థిక వేత్తలంటున్నారు. 2018 మార్చి చివరిన ఈ కంపెనీల అప్పులు రూ.8.8 లక్షల కోట్లుంటే.. 2019 మార్చి నాటికి రూ.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్ట్ నాటికి ఇవి రూ.13 లక్షల కోట్లకు పెరిగినట్టు తాజా లెక్కల్లో వెల్లడైంది. బ్యాంక్‌‌ల నుంచి అప్పులు తీసుకున్న చాలా కార్పొరేట్ కంపెనీలు కూడా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. వ్యాపారాల  నడిపేందుకు డబ్బుల కోసం ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అప్పులు తెచ్చుకోవడం చాలా సాధారణం. గత కొన్నేళ్లుగా ప్రమోటర్లు ఒకింత ఎక్కువగానే ఇలా అప్పులు చేయడంతో, ఇది బ్యాంక్‌‌లకు మరింత ఆందోళనకరంగా మారిందని విశ్లేషకులంటున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీ జారీ చేసిన మొత్తం షేర్ల మార్కెట్ విలువ. షేర్ల ధర తగ్గిపోతే.. మార్కెట్‌‌లో కంపెనీ విలువ కూడా పడిపోతుంది. దీంతో కంపెనీ పరిస్థితి కాస్త ప్రమాదకరంగా మారుతోంది. అప్పులు పుట్టవు. ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు.  బడాబడా వ్యాపార వేత్తలు, సామ్రాజ్యాలూ కూలిపోవడం చూస్తున్నాం. మరికొందరు అప్పులు చేసి వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోతున్నారు. మరికొందరైతే.. దివాలా తీసి ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు దేశం విడిచి పారిపోవాలని చూస్తున్నారు. ఎన్నో కార్పొరేట్ స్కామ్‌‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ ఓ ఎత్తయితే.. మరో ఎత్తు ఆర్థిక మాంద్యం. కార్పొరేట్ ప్రపంచాన్ని భయపెడుతూ.. ఆర్థిక మాంద్యం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా రంగాలు కూలబడ్డాయి. దీంతో స్టాక్ మార్కెట్ కూడా ఘోరంగా కరెక్షన్‌‌కు గురి అవుతోంది. ఊహించని రీతిలో పడిపోతోంది. ఆర్థిక మాంద్యం, స్కామ్‌‌లతో కార్పొరేట్ ఇండియాలో దివాలా పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. బ్యాంక్‌‌లకు ప్రభుత్వం ఇటీవలే రూ.70 వేల కోట్ల క్యాపిటల్‌‌ను ప్రకటించింది. పలు రంగాల్లో ఎఫ్‌‌డీఐ నిబంధనలను సడలించింది. కానీ మరోవైపు నుంచి కంపెనీల అప్పులు పెరిగిపోయి, బ్యాంక్‌‌లకు మరో ప్రమాదం పొంచి వస్తోంది.

క్యాపిటల్ సేకరణ మరింత కష్టం..

డెట్, మార్కెట్ క్యాప్‌‌లకు మధ్యనున్న ఈ తేడా… కార్పొరేట్ డిఫాల్ట్స్‌‌ను పెంచుతాయి. అంటే బ్యాంక్‌‌లు ఇచ్చిన అప్పులు తిరిగి రావు. అవి మొండి బకాయిలుగా మారే అవకాశముంటుంది.  దీంతో కంపెనీలు ఈక్విటీ క్యాపిటల్‌‌ను సేకరించుకోవడం  మరింత కష్టతరమవుతుందని అనలిస్ట్‌‌లు అంటున్నారు. మొత్తం అప్పులు పెరిగిపోయిన కంపెనీల్లో 54.5 శాతం మార్కెట్‌‌లో లిస్ట్‌‌ అయిన జాబితాలోనే ఉన్నాయి. వీటి మార్కెట్ క్యాప్ కూడా తక్కువగా ఉంది. ‘మార్కెట్ క్యాప్ ప్రకారమే కంపెనీ క్యాపిటల్‌‌ను సేకరించుకునే వీలుంటుంది. షేరు ధర పడిపోతే, క్యాపిటల్‌‌ను సేకరించుకోవడం కష్టమవుతోంది. ఆపరేషన్స్ సాగించడానికి అవసరమైన లిక్విడిటీ ఉండదు’ అని ఈక్వినోమిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వయిజరీ సర్వీసెస్ ఫౌండర్, ఎండీ జీ చొక్కలింగమ్ చెప్పారు. టెలికాం, పవర్, మెటల్స్, మైనింగ్, ఇన్‌‌ఫ్రా వంటి రంగాల్లోని చాలా కంపెనీలు ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తక్కువ లిక్విడిటీ, తక్కువ లాభాలు, చాలా తక్కువ మార్కెట్‌‌ క్యాప్‌‌తో ఇవి రన్ అవుతున్నాయి. ఒకవేళ ఆర్థిక వృద్ధి అంచనావేసిన దానికంటే మరింత పడిపోతే.. కంపెనీలు అప్పులు తిరిగి చెల్లించలేని ప్రమాదం మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెప్పారు.

72 కంపెనీల నష్టం రూ.1.14 లక్షల కోట్లు…

ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చాలా కంపెనీలకు ప్రస్తుతం క్యాపిటల్‌‌ అవసరం చాలా ఉందన్నారు. ఈ కంపెనీలు ఇటీవల భారీ ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్నాయి కూడా. మార్కెట్ క్యాప్‌‌ తక్కువగా ఉన్న 195 కంపెనీల్లో 72 కంపెనీల నష్టాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగంలో మరో రౌండ్ మొండిబకాయిలను చూడొచ్చని ఐడీఎఫ్‌‌సీ సెక్యురిటీస్ చీఫ్ ఎకనమిస్ట్, ఈక్విటీ స్ట్రాటజిస్ట్ ధనంజయ్ సిన్హా అన్నారు.మేరీస్ కాలేజ్‌‌, తోళమై సంస్థలతో కలిసి యునిసెఫ్ ఓ సభను నిర్వహించింది. మూడువేల మంది యునిసెఫ్‌‌ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన త్రిష… చిన్నారుల పట్ల జరుగుతున్న