
మీకు ఆగస్టు నెలలో ఏదైనా బ్యాంక్ పని ఉందా లేదా బ్యాంకుకి వెళ్లాల్సి ఉందా అయితే ముందుగా బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మొత్తం 15 రోజుల పాటు మూతపడనున్నాయి. వీటిలో ఆదివారాలు, రెండవ & నాల్గవ శనివారాల వీకెండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి. అలాగే, వివిధ రాష్ట్రాల్లోని పండుగల హాలిడేస్ కూడా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతినెల హాలిడేస్ లిస్ట్ విడుదల చేస్తుంది. అయితే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM వంటి డిజిటల్ సేవలు హాలిడేస్ రోజుల్లో కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయి.
బ్యాంక్ హాలిడేస్ లిస్ట్
ఆగష్టు 8 శుక్రవారం - టెండాంగ్ ల్హో రమ్ ఫట్ కారణంగా గ్యాంగ్‌టక్లో బ్యాంకులు బంద్
9 ఆగస్టు శనివారం - రక్షాబంధన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అహ్మదాబాద్, భోపాల్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, లక్నో, సిమ్లా, భువనేశ్వర్లో బ్యాంకులు బంద్.
ఆగస్టు 13 బుధవారం - ఇంఫాల్లో బ్యాంకులు బంద్.
15 ఆగస్టు శుక్రవారం - స్వాతంత్ర దినోత్సవం, నేషనల్ హాలిడే కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్
ఆగస్టు 16 శనివారం - శ్రీకృష్ణ జన్మాష్టమి / కృష్ణ జయంతి కాబట్టి ఐజ్వాల్, చెన్నై, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గ్యాంగ్‌టక్, చండీగఢ్, జమ్ము, శ్రీనగర్లో బ్యాంకులు బంద్.
ఆగస్టు 27 బుధవారం – వినాయక చవితి కాబట్టి ముంబై, బేలాపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, చెన్నై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవాలో బ్యాంకులు బంద్.
వీకెండ్ హాలిడేస్
ఆగస్టు 3 (ఆదివారం)
ఆగస్టు 9 (రెండవ శనివారం)
ఆగస్టు 10 (ఆదివారం)
ఆగస్టు 17 (ఆదివారం)
ఆగస్టు 23 (నాల్గవ శనివారం)
ఆగస్టు 24 (ఆదివారం)
ఆగస్టు 31 (ఆదివారం)