మళ్లీ యాక్టివ్ అయిన ఐబొమ్మ, బప్పం టీవీ.. తగ్గేదేలేదంటూ రవి మళ్లీ రంగంలోకి దిగాడా?

మళ్లీ యాక్టివ్ అయిన ఐబొమ్మ, బప్పం టీవీ.. తగ్గేదేలేదంటూ రవి మళ్లీ రంగంలోకి దిగాడా?

సినీ ఇండస్ట్రీని పైరసీ వెబ్ సైట్లు పెద్ద తలనొప్పిగా మారాయి. గత కొంత కాలంగా సైలెంట్ ఉన్న ఇవి మళ్లీ తెరపైకి వచ్చి.. నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. థియేటర్లలో పైసా ఖర్చు లేకుండా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల గొడవ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా సినిమాలు చూసేసే ‘ఐబొమ్మ’ (iBomma), ‘బప్పం టీవీ’ వెబ్‌సైట్లు లేటెస్ట్ గా నెట్టింట మళ్లీ యాక్టివ్ అయ్యాయి. కొంతకాలం సైలెంట్‌గా ఉన్న ఈ పైరసీ వెబ్ సైట్లు ఇప్పుడు మరింత స్పీడుగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను లీక్ చేస్తూ టాలీవుడ్ వర్గాల్లో గుబులు రేపుతోంది. మరో సినీ ఇండస్ట్రీని టెన్షన్ లోకి నెట్టాయి.

ట్విస్టుల మీద ట్విస్టులు..

కొన్ని నెలల క్రితం ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వెబ్‌సైట్లకు బ్రేక్ పడింది. ఇక ఐబొమ్మ పని అయిపోయిందని ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకునేలోపే.. బెయిల్‌పై బయటకు వచ్చారు. అంతే, సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు సరికొత్త ఆవే పేర్లతో ఉన్న డొమైన్లు, మిర్రర్ లింకులతో ఐబొమ్మ, బప్పం టీవీలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. వీటితో పాటు పాత ఖిలాడీ ‘మూవీ రూల్జ్’ కూడా జతకలిసింది.

రవి మళ్లీ రంగంలోకి దిగాడా?

సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్నిసార్లు లింకులను బ్లాక్ చేసినా.. డొమైన్ల పేర్లు మార్చేస్తూ  కొత్త అవతారాల్లో వస్తున్నారు. అసలు ఈ వెబ్‌సైట్లను వెనక ఉండి నడిపిస్తోంది ఎవరు? రవి బెయిల్‌పై వచ్చాక మళ్లీ ఆయనే రంగంలోకి దిగాడా లేక వేరే గ్యాంగ్ ఏదైనా ఐబొమ్మ బ్రాండ్ నేమ్‌ను వాడుకుంటోందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ALSO READ : అకస్మాత్తుగా మరణించిన టాలెంటెడ్ యాక్టర్.. రిషబ్ శెట్టి ఎమోషనల్ ట్వీట్

ఇండస్ట్రీ షాక్!

కోట్లు ఖర్చు పెట్టి తీసిన కొత్త సినిమాలు రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ క్వాలిటీతో ఈ సైట్లలో ప్రత్యక్షమవడం సినీ నిర్మాతలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. అటు థియేటర్ కలెక్షన్లు, ఇటు ఓటీటీ బిజినెస్ దెబ్బతింటుండటంతో టాలీవుడ్ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంటీ పైరసీ వింగ్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఈ ‘క్యాట్ అండ్ మౌస్’ గేమ్ మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. డిజిటల్ దునియాలో హల్‌చల్ చేస్తున్న ఈ పైరసీ వెబ్‌సైట్లకు శాశ్వతంగా బ్రేక్ పడేది ఎప్పుడు అని సినీ ఇండస్ట్రీ తలలు పట్టుకుంది. మరోసారి ప్రత్యక్షమైన ఐబొమ్మ, బప్పం టీవీలై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి.