కొత్త పాలసీ.. తెల్లారేదాకా బార్లు ఓపెన్

కొత్త పాలసీ.. తెల్లారేదాకా బార్లు ఓపెన్


న్యూఢిల్లీ: మందు ప్రియులకు ఢిల్లీ సర్కారు గుడ్​న్యూస్ చెప్పింది. తెల్లవారుజాము 3 గంటల వరకు బార్లు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇందుకు కొత్త ఎక్సైజ్ పాలసీ 2021--=22 ని కేజ్రీవాల్ సర్కారు ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్, లాక్​డౌన్ కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, హోటళ్లను ఆదుకునేందుకే కొత్త పాలసీ తెచ్చినట్లు వెల్లడించింది. ఈ పాలసీ అమలుతో లిక్కర్ మాఫియాను అరికట్టవచ్చని, సిటీకి ఆదాయాన్ని పెంచవచ్చని పేర్కొంది. అలాగే, మందు కొనుగోలు చేసే వారి కనీస వయసును 25 నుంచి 21 ఏండ్లకు కుదించింది. బీర్ల కోసం మైక్రో బ్రూవరీలకు అనుమతిచ్చింది. కొత్త పాలసీలో భాగంగా ప్రభుత్వ రిటెయిల్ వైన్ షాపులను ఢిల్లీ ప్రభుత్వం ఎత్తివేయనుంది.