బాసర ట్రిపుల్ ఐటీకి వరల్డ్ బుక్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో చోటు

బాసర ట్రిపుల్ ఐటీకి వరల్డ్ బుక్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో చోటు
  • స్టడీ అవర్స్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు 

 నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్ల స్టడీ అవర్స్ కార్యక్రమానికి అంతర్జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. విద్యార్థుల అకడమిక్ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా ఈ స్టడీ అవర్స్ ప్రోగ్రామ్ ను అంతర్జాతీయ పత్రిక యూకే మిర్రర్ మొదటి పేజీ ముఖచిత్రంగా ప్రచురించింది.

స్టడీ అవర్స్ కార్యక్రమానికి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో చోటు లభించినట్లు వైస్ ఛాన్స్ లర్ గోవర్ధన్ తెలిపారు