
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- గతంలో పదో తరగతి ఫలితాల ఆధారంగా విద్యార్థులుకు సీట్ల కేటాయింపు
హైదరాబాద్: ప్రఖ్యాత బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లను పాలిసెట్ ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. గతంలో పదో తరగతి ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాలిసెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పాలిసెట్ నోటిఫికేషన్ ను సాంకేతిక విద్యా మండలి సవరించింది.
దరఖాస్తు చేసుకోవడానికి గత నెల నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు కోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఈనెల 25వ తేదీ ఆఖరు. అయితే వంద రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 27వ తేదీ వరకు, మూడు వందల రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.